కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నడుంబిగించింది. ఈ మేరకు వ్యాక్సిన్లపై సమగ్ర సమాచారంతో ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో మొదటివిడతగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయనున్నట్టు వెల్లడించింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొదట వైద్య ఆరోగ్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి కరోనా టీకా ఇస్తారు. ప్రాధాన్యతా క్రమంలో 50 ఏళ్లు పైబడిన వారికి, ఇతర వ్యాధిగ్రస్తులకు ఇస్తారు. తాము అందించే వ్యాక్సిన్ ఏ దేశాలకు తీసిపోని రీతిలో ఉంటుందని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.