Site icon TeluguMirchi.com

విరాట్ కి బీసీసీఐ పర్మిషన్

ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ తిరిగిరానున్నాడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవ సమయం దగ్గరపడుతుండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు కోహ్లీకి బీసీసీఐ ప్రత్యేకంగా పితృత్వపు సెలవు మంజూరు చేసింది. తాజాగా, కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తో చిట్ చాట్ సందర్భంగా ఈ అంశంపై స్పందించాడు.

తమ తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఈ విషయంలో స్పష్టతో ఉన్నానని వివరించాడు. ఏ విధంగా చూసినా ఆ మధుర క్షణాలను కోల్పోలేమని కోహ్లీ పేర్కొన్నాడు.   

Exit mobile version