Site icon TeluguMirchi.com

బాక్సింగ్‌ డే టెస్టులో పట్టు బిగించిన టీమ్‌ఇండియా

ఆసిస్ తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను మరోసారి కట్టడి చేసింది. 277/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 49 పరుగులు చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.  దాంతో ఆస్ట్రేలియాపై 131 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది.  

ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారీ లోటును పూరించి ఈ మ్యాచ్‌లో నిలవాలని చూసిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ జో బర్న్స్‌(4)ను ఉమేశ్‌ యాదవ్‌ నాలుగో ఓవర్‌లోనే ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆపై లబుషేన్‌(28), మాథ్యూవేడ్‌(48) కాసేపు వికెట్‌ కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, అశ్విన్‌ వేసిన ఓ చక్కటి బంతికి ప్రమాదకర లబుషేన్‌ పెవిలియన్‌ చేరాడు. స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు.  దీంతో ఆసీస్‌ 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ ఓటమి దిశగా సాగింది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి అదే జోరు కనబరిస్తే కనుక విజయం మన సొంతమే.  

Exit mobile version