అమెరికా సంస్థ ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌కు బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అనంతరం ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి బహ్రెయిన్ కూడా ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగం కింద ఆ దేశాలు ఆమోదం తెలిపాయి.
ఈ వ్యాక్సిన్ సురక్షితమని బ్రిటన్ సంస్థ ‘మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ’ ఇటీవలే తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ రెండు దేశాల మార్గంలోనే నడుస్తోంది. దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాల్సిందిగా ఫైజర్, భారత ఔషధ నియంత్రణ జనరల్ ని కోరింది. భారత్‌లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.