వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృస్టింకాడు. శ్రీలంకతో జరుగిన టీ20 మ్యాచ్‌లో సిక్సుల వర్షం కురిపించారు. ఒక ఓవర్లో ఆరు సిక్సులు బాది అరుదైన రికార్డును సాధించాడు.
శ్రీలంక స్పిన్నర్ ధనంజయ ఈ మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ చేశారు. ఆ తరువాత ధనుంజయ బౌలింగ్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించారు. వరుసగా ఆరు సిక్సులు బాది బౌలర్‌కు ఆ ఓవర్‌ను ఓ పీడకలగా మిగిల్చాడు.
పోలార్డ్ దాటికి విండీస్ 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌తో ఓవర్లో ఆరుసిక్సులు బాదిన బ్యాట్స్మన్ల జాబితాలో పోలార్డ్ కూడా చేరాడు . ఇంతకు ముందు ఈ ఘనతను సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మన్ హర్షలీ గిబ్స్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరిట వుంది. ఇప్పుడు ఈ వరుసలో కిరణ్ పోలార్డ్ కూడా వచ్చాడు.