Site icon TeluguMirchi.com

పాక్‌ క్రికెట్‌ పై లైంగిక వేధింపు ఆరోపణలు

పాకిస్థాన్‌ క్రికెట్‌ కెప్టన్ బాబర్‌ అజాం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. తనను వివాహం చేసుకుంటానని మాటిచ్చిన ఆయన.. కెరీర్లో ఉన్నత స్థానానికి చేరిన తర్వాత మాట మార్చాడని ఆమె విమర్శించారు. వేధింపులు గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్నాయంటూ ఆ మహిళ  చేసిన మీడియా ప్రకటన చర్చనీయాంశమైంది.

బాబర్‌ అజాంతో కలసి చదువుకున్నానని ఈ మహిళ తెలిపారు. వివాహం చేసుకుందామని 2010లో అతనే ముందు ప్రతిపాదించాడని అన్నారు. రిజిస్టర్‌ వివాహం చేసుకునే ఉద్దేశంతో ఆ మరుసటి సంవత్సరం తాము ఇంటినుంచి పారిపోయామని వివరించారు. బాబర్‌ కెరీర్లో రాణించేందుకు తాను ఆర్థికంగా సహాయం చేశానని.. అయితే జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికైన తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చిందని మీడియాకు తెలిపారు. 

Exit mobile version