కరోనా మహమ్మారి ఉధృతి రాబోయే వారాల్లో మరింత విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌ను ముంచెత్తిన కరోనా సెకండ్‌వేవ్ రాబోయే వారాల్లో మరింత విజృంభించే అవకాశం ఉందని బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధన బృందం తేల్చి చెప్పింది. మరణాల సంఖ్య ప్రస్తుత స్థాయి కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.. జూన్ 11 నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 4 లక్షలను దాటేస్తుందని బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బృందం అంచనా వేసింది. మేథమెటికల్ మోడల్ ప్రకారం ఈ అంచనాకు వచ్చినట్టు ప్రకటించింది. పలువురు కోవిడ్ పరిశోధకులు కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.