ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవం

టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్  అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ మ్యాచ్‌ గెలవడమే కాకుండా అడిలైడ్‌  పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

ఈ క్రమంలోనే అతడు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికై ‘జానీ ముల్లగ్‌’ పతకం సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా ఎంసీజీ ప్రతిష్ఠాత్మకంగా గౌరవించే బోర్డులో రెండోసారి తన పేరును నమోదు చేసుకున్నాడు.