Site icon TeluguMirchi.com

ఇండియాకి సారీ చెప్పిన వార్నర్

మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పట్ల పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తప్పని ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. భారత జట్టుతో పాటు, సిరాజ్‌కు మంగళవారం అతడు క్షమాపణలు చెప్పాడు.  బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్‌పై పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆ వివాదంపై స్పందించిన వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు.  టీమ్‌ఇండియా, సిరాజ్‌కు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. ఎక్కడైనా, ఎప్పుడైనా జాతి వివక్ష, దుర్భాషలాడటం ఆమోదించదగినవి కాదు. ఇకపై మా ప్రేక్షకుల నుంచి ఇలాంటివి చోటుచేసుకోవద్దని ఆశిస్తున్నా’ అని ఆసీస్‌  విచారం వ్యక్తం చేశాడు.  

Exit mobile version