Site icon TeluguMirchi.com

ఆస్ట్రేలియా జెర్సీ వెనుక కధ

ఆస్ట్రేలియా,  టీమ్‌ఇండియాతో తొలి టీ20లో  వేరే రంగు జెర్సీతో బరిలో దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆ జెర్సీ వేసుకోవడం వెనకాల మంచి ఉద్దేశమే ఉంది. ఆస్ట్రేలియాలో తొలితరం ప్రజలైన ఆదివాసీలకు గుర్తుగా ఆ దేశ క్రికెటర్లు ఈ జెర్సీని ధరించారు.

 దీని రూపకల్పనలో ఆదివాసీ మహిళలైన ఫియోనా, హెజెన్‌ పాత్ర ఉండడం విశేషం. నల్ల రంగులో రూపొందించిన జెర్సీపై ఆదివాసీల మూలలను గుర్తుకుతెచ్చేలా విభిన్న రూపకల్పనలు చేశారు.

దీనిపై ఉన్న బంగారు నక్షత్రాలు.. వాళ్ల పూర్వీకులకు, వికెట్లు.. మాజీ, తాజా ఆదివాసీ క్రికెటర్లకు, ఆకుపచ్చని వృత్తాలు.. ఏకత్వానికి, కొనసాగింపునకు.. నీలం రంగు చిహ్నాలు.. నదులు, భూమికి సంకేతాలు. 1868లో తొలి ఆస్ట్రేలియా ఆదివాసీ జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనను పురస్కరించుకుని 152 ఏళ్ల చరిత్రకు ప్రతిబింబంగా జెర్సీ వెనకవైపు తీర్చిదిద్దారు.  

Exit mobile version