ఈకామర్స్ దిగ్గజం భారత్ లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. జేఈఈ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించింది. ‘అమెజాన్ అకాడమీ’ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. వెబ్ సైట్ ద్వారానే కాకుండా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఆన్ లైన్ అకాడమీలో లైవ్ లెక్చర్స్ తో పాటు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ కూడా ఉంటుంది. అంతేకాదు విద్యార్థులు తమను తాము సమీక్షించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్లాట్ ఫామ్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉందని… మరికొన్ని నెలల పాటు ఉచితంగానే ఉంటుందని ఈ సందర్భంగా ఓ ప్రకటనలో అమెజాన్ ఇండియా తెలిపింది.