Site icon TeluguMirchi.com

అబుదాబిలో గేల్ సునామీ

వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ అబుదాబిలో జరుగుతున్న టీ10 టోర్నీలో గేల్ ఆకాశమే హద్దులా విరుచుకుపడ్డాడు. అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్… మరాఠా అరేబియన్స్ జట్టుతో మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. సుడిగాలిలా విజృంభించిన గేల్ 6 ఫోర్లు, 9 భారీ సిక్సులతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. విశేషం ఏంటంటే… గేల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోవడానికి కేవలం 12 బంతులే ఆడాడు. గతంలో ఇదే రికార్డు మహ్మద్ షేజాద్ పేరిట ఉండగా, 12 బంతుల్లో 50 రన్స్ చేసి ఆ రికార్డును గేల్ సమం చేశాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన మరాఠా అరేబియన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. ఇక లక్ష్యఛేదనలో గేల్ సునామీ వేగంతో ఆడడంతో టీమ్ అబుదాబి ఆ లక్ష్యాన్ని 5.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ గా బరిలో దిగిన గేల్ 84 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Exit mobile version