కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైంది. దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. టీకా తొలి డోసును ఓ నర్సుకు అందించారు. దీంతో క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్‌లో క్రిటికల్ కేర్‌లో నర్సుగా పనిచేస్తున్న సాండ్రా లిండ్సే అగ్రరాజ్యంలో తొలి టీకా పొందిన వ్యక్తిగా నిలిచారు.
టీకా పొందిన సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తంచేశారు. ఈ టీకాతో ఉపశమనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ రాకతో అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగింపునకు దీన్నో నాందిగా భావిస్తున్నానన్నారు.