రామ్‌చరణ్ బాలీవుడ్ ఎంట్రీ సవ్యంగా జరిగేట్టు లేదు. ఈ మెగా హీరో సినిమాకీ అవాంతరాలు తప్పడం లేదు. ఈ సినిమా రైట్స్ కోసం అక్కడ కుమ్ములాటలు మొదలయ్యాయి. అవి కోర్టు వరకూ వెళ్లాయి. అసలైన జంజీర్ నిర్మాత అమిత్ మెహ్రా కుమారుల మధ్య సయోధ్య లేకపోవడంతో రీమేక్ రైట్స్ కోసం వాళ్లు కోర్టుకెక్కారు. వివాదానికీ సినిమా విడుదలకు లింకు పెట్టొద్దని ముంబై న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దాన్ని సవాలు చేస్తూ అమిత్ బ్రదర్స్ సుప్రీం మెట్లు ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వీరికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ వివాదం తీరేవరకూ ఈ సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు… ఆరు వారాల గడువు విధించింది. దాంతో జంజీర్ సినిమా విడుదలలో గందరగోళం నెలకొంది. రైట్స్ గొడవ తీరేదెప్పుడో? సినిమా బయటకు వచ్చేదెప్పుడో?