Site icon TeluguMirchi.com

ఆ సినిమాకి రూ.30 కోట్లు వ‌స్తాయ‌ట‌!

yvs-chowdary-reyరేయ్ సినిమాపై వైవిఎస్ చౌద‌రి భారీ ఆశ‌లే పెట్టుకొన్నాడు. ఉన్నదంతా ఆ సినిమాపై ధార‌బోశాడు. కొత్త కుర్రాడు అని చూడ‌కుండా… జోరుగాఖ‌ర్చుపెట్టాడు. అమెరికాలో స‌గం- వెస్టీండీస్‌ లో స‌గం సినిమా తీశాడు. దాంతో ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌య్యింది. ఈ సినిమా బ‌డ్జెట్ ఇప్పటికే రూ.20 కోట్లు దాటేసింది. కొత్త హీరో సినిమాకి మ‌రీ అంత అవుతుందా? అని అంద‌రూ ముక్కున వేలేసుకొంటున్నారు. చిరంజీవి ఫ్యాన్స్‌ ని న‌మ్ముకొనే చౌద‌రి ఆ స్థాయిలో ఖ‌ర్చు పెట్టారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయినా ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఆయ‌న ధీమా చూస్తే ముచ్చటేసినా – వాటి వెనుక బోలెడ‌న్ని అనుమానాలు. ఓ కొత్త హీరో సినిమా ఎంత హిట్టయినా ఆ స్థాయిలో వ‌సూలు చేయ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితిలో వీలు కాదు. బాద్‌ షా సినిమాకే దిక్కులేకుండా పోయింది. తొలి మూడు రోజులు ఇర‌గ ఆడేసినా ఆ సినిమా రూ.40 కోట్ల ద‌గ్గరే ఆగిపోయింది. మ‌రి చౌద‌రికి ఈ కాన్పెడెన్స్ ఎక్కడిది???

Exit mobile version