జగన్‌ రైతు భరోసా పథకం ఎలా ఉండబోతుందో తెలుసా?

తెలంగాణ రైతు బంధు పథకం పెట్టిన నేపథ్యంలో ఎన్నికల ముందు వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ రైతు భరోసా పథకంను ప్రవేశ పెడతానంటూ హామీ ఇచ్చాడు. సీఎం అయిన తర్వాత జగన్‌ తన మాటను నిలుపుకోబోతున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చినట్లుగా రైతు భరోసా పథకంను ప్రారంభించేందుకు సిద్దం అయ్యారు. అందుకు సంబంధించిన నియమావళిని అధికారులతో చర్చించి రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మొత్తంతో కలిపే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతుంది.

కౌలు రౌతులకు కూడా ఈ డబ్బు అందేలా చూడబోతున్నారు. కేంద్రం నుండి రూ.6 వేలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం దానికి రూ.6500 అదనంగా చేర్చి మొత్తంగా 12500 రూపాయలను రైతులకు ప్రతి సంవత్సరం ఇవ్వబోతుంది. ఈ సాయం వల్ల రైతుకు చాలా వరకు లాభం చేకూరుతుందని జగన్‌ భావిస్తున్నాడు. ముఖ్యంగా చిన్నకారు రైతులకు ఈ సాయంతో పెట్టుబడి కష్టాలు తీరుతాయని వైకాపా నాయకులు భావిస్తున్నారు. అక్రమార్కులకు ఈ సాయం వెళ్లకుండా పక్కా ప్రణాళికలను సిద్దం చేశారు.