Site icon TeluguMirchi.com

‘ఎవడు’ కలెక్షన్ ఎంత ?

yevaduరామ్‌చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ఎవడు మూవీ రిలీజ్ డేనే మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్ల రేస్‌లో దూసుకుపోతోంది. ‘ఎవడు’ చిత్రం ఘన విజయం సాధించడంపై ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఎవడు సక్సెస్ మీట్ లో దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మ్యా బ్యానర్ లో నిర్మించిన చిత్రాల్లో అతిపెద్ద హిట్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజున 9.03 కోట్లు వసూలు చేసిందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో వాయిదా పడుతూ వచ్చిన ‘ఎవడు’ ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదు అని అన్నారు. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఎలా వుండగా బెస్ట్ ఓపినింగ్ కలెక్షన్ చిత్రాలలో ‘అత్తారింటికి దారేది’ (రూ.10.75 కోట్లు) తర్వాత ‘ఎవడు’ రెండో స్థానం లో వుందని వస్తుంది.

Exit mobile version