వర్మ చిత్రం లో ఛాన్స్ కొట్టేసిన యామీగౌతమ్‌..

Yami-Gautam-Beautifullటాలీవుడ్ , బాలీవుడ్ చిత్రాలలో ఛాన్స్ లు కొట్టేస్తూ సక్సెస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న యామీగౌతమ్‌ కు బంపర్ ఆఫర్ దక్కింది..సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే సర్కార్ 3 లో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

ఇప్పటికే ‘సర్కార్‌’, ‘సర్కార్‌ రాజ్‌’ చిత్రాలను తెరకెక్కించి అద్భుత విజయాలను అందుకున్న వర్మ, మరోసారి సర్కార్ 3 హ్యాట్రిక్ కొట్టాలని కసి తో ఉన్నాడు. ఈ చిత్రం లో యామీగౌతమ్‌ పాత్ర విషయానికి వస్తే తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకునే యువతిగా అను కర్కారే పాత్రలో యామీ కనిపించబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా వర్మనే ప్రకటించాడు.