విలక్షణమైన నటనతో ప్రేక్షకులలో అశేష ఆదరణ దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రముఖ నటుడు ‘సుహాస్’ హీరో గా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిత్రబృందం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
అదేంటంటే, ఈ చిత్రాన్ని మహిళల కోసం ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయించింది. బుధవారం(ఫిబ్రవరి 8) రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు మొత్తం 38 థియేటర్లలో ఈ ఉచిత షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు అయ్యింది..ఈ నాలుగు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంది.