Site icon TeluguMirchi.com

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందంటే..

విజయ్ దేవరకొండ ,రాశీ ఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఎజిబెల్లా, క్యాథరీన్ జంటగా క్రాంతి మాధవ్ డైరెక్షన్లో కె ఎస్ రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘ వరల్డ్ ఫేమస్ లవర్ ‘. రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఏపీ మరియు తెలంగాణలలో కలిపి వరల్డ్ ఫేమస్ లవర్ 22కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. మరి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం తో ఓపెనింగ్స్ గట్టిగానే రాబట్టాల్సి ఉంటుంది. మరి విజయ్ ఆ రేంజ్ లో రాబడతాడో లేదో చూడాలి.

Exit mobile version