Site icon TeluguMirchi.com

69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీళ్ళే..


భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. 2021 సంవత్సరానికి సంబంధించి జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో జరిగిన జ్యూరీ విలేకరుల సమావేశంలో విజేతలను ప్రకటించారు.

జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్(పుష్ప) సొంతం చేసుకున్నాడు. దీంతో 69 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న మొట్ట మొదటి తెలుగు నటుడిగా బన్నీ చరిత్ర సృష్టించాడు. కాగా ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ సినిమాకు దక్కింది. అయితే ఇది వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా కావడం విశేషం. ఉత్తమ చిత్ర విమర్శకుడు కేటగిరిలో పురుషోత్తమచార్యులు(తెలుగు) కు అవార్డు దక్కింది. ఇకపోతే నేషనల్ అవార్డ్స్ లోనూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హవా కొనసాగింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. కాగా మొత్తంగా ఎవెరెవరు ఏ ఏ క్యాటగిరిలో విజేతలుగా నిలిచారంటే..

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప: ది రైజ్‌)
ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కారియావాడి), కృతిసనన్‌ (మీమీ)
ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌ (హిందీ)
ఉత్తమ తెలుగు సినిమా – ఉప్పెన
ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ మహాజన్‌ (గోదావరి – మరాఠీ)
ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కశ్మీర్‌ ఫైల్స్‌ హిందీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠి (మిమి-హిందీ)
ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: కింగ్‌ సాలమన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ కొరియోగ్రపీ: ప్రేమ్‌రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ గీత రచన: చంద్రబోస్‌ (కొండపాలం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు (మలయాళం)
ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్‌ ఉద్దమ్‌ (అవిక్‌ ముఖోపాధ్యాయ)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయఘోషల్‌ (ఇరివిన్‌ నిజాల్‌ – మాయావా ఛాయావా)
ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌- కొమురం భీముడో)
ఉత్తమ విజువ‌ల్ ఎఫెక్ట్ : వి శ్రీనివాస్(ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ బాల నటుడు: భావిన్‌ రబారి (ఛల్లో షో-గుజరాతీ)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం :ఆర్‌ఆర్‌ఆర్‌ (రాజమౌళి)
ఉత్తమ సంగీతం(పాటలు): దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప)
ఉత్తమ సంగీతం(నేపథ్య): కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ మేకప్‌: ప్రీతిశీల్‌ సింగ్‌ డిసౌజా (గుంగూబాయి కాఠీయావాడి)
ఉత్తమ కాస్ట్యూమ్స్‌: వీర్‌ కపూర్‌ ఇ (సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సర్దార్‌ ఉద్దమ్‌ సింగ్‌ (దిమిత్రి మలిచ్‌, మన్సి ధ్రువ్‌ మెహతా)
ఉత్తమ ఎడిటింగ్‌: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠీయావాడి)

Exit mobile version