విన్నర్‌ కాదు.. లూజర్‌

winner

సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కి గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విన్నర్‌’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ దక్కాయి. మొదటి మూడు రోజుల్లో సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను ‘విన్నర్‌’ రాబట్టింది. దాంతో లాంగ్‌ రన్‌లో కూడా ఈ సినిమా కుమ్మేయడం ఖాయమని మెగా ఫ్యాన్స్‌ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. అయితే షాకింగ్‌గా ఈ చిత్రం మొదటి మూడు రోజుల తర్వాత కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి. భారీ లాభాలు ఖాయమనుకున్న నిర్మాతలకు నిరాశే మిగిలింది.

మొదటి వారం రోజుల్లో ఈ సినిమా 13 కోట్లను వసూళ్లు చేసింది. మొదటి మూడు రోజుల్లో 10 కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం ఆ తర్వాత కేవలం మూడు కోట్లను మాత్రమే వసూళ్లు చేసింది అంటే ఈ సినిమా పరిస్థితి ఏంటి, కలెక్షన్స్‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంతో లాభాలు పొందాలని ఆశించిన నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవు. విడుదలైన మొదటి రోజే మిశ్రమ టాక్‌ వచ్చిన ఈ సినిమాకు బడ్జెట్‌ రికవరీ అవుతుందని ట్రేడ్‌ వర్గాల వారు అంచనా వేశారు. అయితే తాజా పరిస్థితులను చూస్తుంటే విన్నర్‌ కాస్త లూజర్‌గా మిగిలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకోవడంతో తేజూ కూడా స్టార్‌ హీరోల జాబితాలో జాయిన్‌ అయినట్లే అని మెగా ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.