Site icon TeluguMirchi.com

రూలర్‌… పొటిలిక‌ల్ సినిమానా?

balayyaనంద‌మూరి బాల‌కృష్ణ త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. సినిమాని బ‌ల‌మైన ప్రచార సాధ‌నంగా వినియోగించుకోవాల‌ని చూస్తున్నారు. త‌న సినిమాతో…. పార్టీలో ఇమేజ్‌నీ, అభిమాన గ‌ణాన్నీ పెంచుకోవాల‌ని ప్రయ‌త్నిస్తున్నారు. ఇప్పుడాయ‌న ఆశ‌ల‌న్నీ రూల‌ర్ పైనే. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శక‌త్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో పేరుకు త‌గ్గట్టు… బాల‌య్యని గొప్ప పాల‌కుడిగా చూపించ‌బోతున్నార‌ట‌. ప్రజ‌ల మ‌నిషిగా చూపించ‌బోతున్నార‌ట‌. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల‌తో పాటు… స్ఫూర్తి నింపే క‌థ అట‌. 2014 ఎన్నిక‌ల ముందు ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని బాల‌య్య భావిస్తున్నారు. అటు… త‌న ఎన్నిక‌ల‌కూ క‌లిసొస్తుంద‌ని! మ‌రి ఈ రూల‌ర్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో…?

Exit mobile version