ప్రభాస్ కి పెళ్లి కుదిరిందా?

prabhashటాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ప్రభాస్ పేరే చెబుతారు. సిక్స్ ప్యాక్ హేరోఇజం తో అమ్మాయిల మనసు కొల్లగొట్టిన ఈ రెబల్ స్టార్ దగ్గర పెళ్లి మాట ఎప్పుడు ఎత్తినా ‘అప్పుడే కాదు..’ అని చెప్పి తప్పించుకుంటున్నాడు. “రాజమౌళి సినిమా రెండేళ్ళు పడుతుంది. ఆ తరవాతే నా పెళ్లి” అని ఈ మధ్య ప్రభాస్ స్వయంగా చెప్పాడు. అయితే ప్రభాస్ మనసు పెళ్లిపైకి మళ్ళింది. ఇంట్లోవాళ్ళు కుడా తగిన వధువు కోసం ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కి ఓ సంబంధం ఖాయమయ్యింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా వుంచుతున్నారు. భీమవరంలో ప్రభాస్ బంధువులు వున్నారు. సంబంధం కుడా అక్కడి నుంచే వచ్చిందట. ప్రభాస్ ఓకే అన్నా… పెళ్ళికి కాస్త సమయం కావాలని అడిగాడట. రాజమౌళి సినిమా ‘బాహుబలి’ పూర్తి అయిన తరవాతే ప్రభాస్ పెళ్లి కొడుకు అవతారం ఎత్తనున్నాడు. అయితే ఈ విషయాన్ని రెబల్ స్టార్ కుటుంబం ఖండించింది. “అలాంటిది ఏమీ లేదు. మంచి విషయం వుంటే.. దాచుకోవడం ఎందుకు? అందరితో పంచుకుంటాం కదా” అని చెబుతున్నారు.