ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాడా?

pavan1చిన్న బులిటెన్‌తో సంచ‌ల‌నం సృష్టించాడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌. రెండు వారాల్లో ప్రెస్ మీట్ పెడ‌తా.. పార్టీ సంగ‌తుల‌న్నీ అప్పుడు తేలుస్తా… అని రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించాడు. రెండు వారాల్లో ప‌వ‌న్ ఏం తేలుస్తాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ప‌వ‌న్ పార్టీ పెడ‌తాడ‌న్న వార్తలొస్తున్నా.. అందుకు అవ‌కాశం లేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఎందుకంటే ఎన్నిక‌ల‌కు ఎంతో దూరం లేదు. పార్టీ స్థాపించ‌డం, దానికంటూ ఓ సొంత అస్థిత్వం తీసుకురావ‌డం ఇంత చిన్న గ్యాప్‌లో అసాధ్యం. అందుకే.. పార్టీ పెట్టే అవ‌కాశాలు ఏమాత్రం లేవు. అయితే ఏదో ఓ పార్టీ త‌ర‌పునుంచి ఎంపీగా మాత్రం బ‌రిలో దిగ‌డం ఖాయంలా అనిపిస్తోంది. మ‌ల్కాజ్‌గిరి, కాకినాడ‌, ఏలూరు.. ఈ మూడు స్థానాల్లో ఒక‌దాని నుంచి ప‌వ‌న్ బ‌రిలో దిగే అవ‌కాశాలున్న‌య‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవ‌కాశాలున్నాయ‌ని మ‌రో వ‌ర్గం వాదిస్తోంది. ఇప్ప‌టికే టీడీపీకి ప‌వ‌న్ మాటిచ్చాడ‌ని… కాకినాడ నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేసే అవ‌కాశాలు నూటికి నూరుశాతం ఉన్నాయ‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది. మ‌రి ప‌వ‌న్ ఏమంటాడో…? అస‌లు ప‌వ‌న్ మ‌న‌సులో ఏముందో… ఆయ‌న‌కే ఎరుక‌.