అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా… ఈ రెండు సినిమాలూ ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..అనగానే సినీ ప్రియులు సంబరాలు చేసుకొంటున్నారు. ఈ బాక్సాఫీసు పోరులో పవన్ గెలుస్తాడా? లేదంటే ఎన్టీఆర్ విజయం సాధిస్తాడా? అంటూ లెక్కలు వేసుకొంటున్నారు. కానీ.. ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ప్రస్తుతం రెండు పెద్ద సినిమాలు ఒకేసారి ఢీ కొట్టుకొనే పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని థియేటర్లు అందుబాటులో లేదు. ఒక్కో సినిమాకీ 1000 థియేటర్లు కావాలి. అంటే ఈ రెండు సినిమాలకు 2000 థియేటర్లు ఉండాలి. కానీ రాష్ట్రంలో ఉన్నవి 1600 థియేటర్లే. అంటే నాలుగొందలు కోత పడుతుంది. మిగతా చిన్నా చితకా సినిమాలన్నీ కలపి 200 థియేటర్లు కబ్జా చేసినా 1400లే మిగులుతాయి. ఇవి ఎట్టిపరిస్థితుల్లోనూ సరిపోవు. పైగా ఒకరితో మరొకరు పోటీ పడి సినిమా విడుదల తేదీ ప్రకటించారు తప్ప – సినిమాని తీసుకొచ్చే ఉద్దేశం లేదని టాలీవుడ్ నిపుణుల టాక్. అంటే ఈ రెండు సినిమాల్లో ఒకటి కచ్చితంగా వెనకడుగు వేయాల్సింది. మరి వెనక్కి తగ్గేది ఎవరు? పవన్ కల్యాణా?? లేదంటే ఎన్టీఆరా?? ఎనీ గెస్…???