Site icon TeluguMirchi.com

‘వన్’ ను ‘చరణ్’ బీట్ చేస్తాడా?

yevadu-oneభారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా మహేష్ ‘1 నేనొక్కడినే’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అటు మహేష్ ఇటు ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మహేష్ హ్యాట్రిక్ సంక్రాంతి హీరో అవుతాడని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ ఐనట్లు కనిపిస్తోంది. తొలి రోజు ఆట చూసిన ప్రేక్షకులను కదిపితే ‘వన్’ అంచనాలను అందుకోలేదనే చెప్తున్నారు. మహేష్ యాక్షన్, డ్యాన్స్, నటన హైలెట్ గా నిలిచినా.. సరైన కధ లేకపోవడం, సామాన్య ప్రేక్షకుడికి తికమక పెట్టె స్క్రీన్ ప్లే వుండడం, కామెడి టచ్ లేకపోవడం నిరాశ కలిగించిన అంశాలుగా వినిపిస్తున్నాయి.

ఇదీలావుంటే టాలీవుడ్ లో మరో భారీ చిత్రం రామ్ చరణ్ ‘ఎవడు’ ఈ నెల 12 న బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తుంది. చరణ్ కూడా సంక్రాంతి హీరోనే. గత ఏడాది నాయక్ తో సందడి చేశాడు. ఇప్పుడు ‘ఎవడు’ తో మళ్లీ రెడీ అయ్యాడు. వన్ కు తొలి రోజే నెగిటివ్ టాక్ రావడం ‘ఎవడు’ కు అనుకూలించే అంశం. ఇప్పుడు చరణ్ కె చాన్స్ లేక్కువ అని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ‘వన్’ ను బీట్ చేయడానికి ‘ఎవడు’ లో కాస్త కామెడి, యాక్షన్ మిక్స్ చేసుంటే చాలు సంక్రాంతి కి నిలబడిపోతుందని వినిపిస్తుంది. మరి చరణ్ ఎవడుతో ‘వన్’ ను బీట్ చేస్తాడా? సంక్రాంతి హీరో గా నిలబడతాడా ? అని తెలియాలంటే ‘ఎవడు’ బొమ్మ పడాల్సిందే.

Exit mobile version