Site icon TeluguMirchi.com

మ‌గ‌ధీర‌ని మించిపోవాల‌ని..

bahubaliరాజ‌మౌళి మ‌రో భారీ సినిమా కోసం స్కెచ్ వేస్తున్నాడు. బాహుబ‌లి ని మ‌గ‌ధీర‌ను మించిన చిత్రంలా తీర్చిదిద్దాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వ‌ర‌కూ రాజ‌మౌళి కెరీయ‌ర్‌లో అదే హ‌య్యస్ట్ బ‌డ్జెట్ సినిమా. దానికి మించి బాహుబ‌లి కోసం ఖ‌ర్చు పెట్టిస్తున్నాడ‌ట‌. మ‌గ‌ధీర‌లో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ హైలెట్‌గా నిలిచింది. సినిమాని ఓ రేంజులోకి తీసుకెళ్లిన ఎపిసోడ్ అది. అలాంటి భారీ ఎపిసోడ్ బాహుబ‌లిలోనూ ఉంద‌ట‌. ప్రభాస్‌, రానాల మ‌ధ్య పోరాటాన్ని క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో తీర్చిదిద్దుతున్నాడ‌ట‌. బాహుబ‌లిని ఆయువు ప‌ట్టులాంటి ఈ స‌న్నివేశం కోసం ప‌క‌డ్బందీ ప్రణాళిక‌లు ర‌చించాడు. దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ స‌న్నివేశాన్ని బ్లూమేట్‌లో తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నాడు. ఈ ఒక్క సీన్‌కి కొన్ని కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తార‌ట‌. మ‌రి ఆ మెగా సీన్‌ని సిల్వర్  స్ర్కీన్‌పై ఎప్పుడు చూస్తామో??

Exit mobile version