మొదటిదానికి మొగుడులేదు….. రెండోదానికి…. అన్న సామెత మనకు తెలిసిందే. నిర్మాత, దర్శకుడు వై.ఎస్.చౌదరి పరిస్థితి అలానే వుంది. మూట గట్టుకున్న ఫ్లాపులు వెంటాడుతున్నాయి. చిరంజీవి మేనల్లుడి సినిమా పూర్తి కావాల్సి వుంది. దాని ఇబ్బందులు దానికి వున్నాయి. మొదలయి మూడేళ్ళు కావస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు సీతయ్య, లాహిరి,లాహిరి,లాహిరి లో సినిమాలకు సిక్వేళ్ళు తీస్తాడట. అసలీ సినిమాలు సీక్వెళ్ళకు సరిపోయే సినిమాలేనా అన్నది ప్రశ్న. పైగా వాటిలో నటించిన వారంతా దాదాపు రిటైర్ అయిపోయారు కూడా. మరి చౌదరి ప్రణాళిక ఏమిటో? ఇలా ఏదో ఒక హడావిడి చేసేసి వార్తల్లో ఉండటమేనా? నిజంగా అంత సీను వుందా ?