తమిళ సూపర్ స్టార్ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ తమ కొడుకు అంటూ కదిరేశన్ మరియు మీనాక్షి దంపతులు గత కొంత కాలంగా న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ధనుష్ తమ కొడుకు అనేందుకు తమ వద్ద అన్ని సాక్షాధారాలు ఉన్నాయని, అందుకోసం మేము ఈ పోరాటం చేస్తున్నట్లుగా కదిరేశన్ చెప్పుకొచ్చాడు. తాజాగా ధనుష్‌కు తండ్రిగా చెప్పుకుంటున్న కదిరేశన్ మాట్లాడుతూ ధనుష్ నోరు తెరిచి వారు నా తల్లిదండ్రులు కారు అంటూ ఒక ప్రకటన చేస్తే మా పోరాటం విరమించుకుంటాం అని ఆయన అన్నాడు.
కదిరేశన్ వ్యాఖ్యలపై దనుష్ స్పందిస్తాడని అంతా అనుకున్నారు. మీడియా ముందుకు వచ్చి తనకు కదిరేశన్ దంపతులకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాడేమో అని భావించారు. అయితే ఇప్పుడు కూడా ధనుష్ నోరు తెరవడం లేదు. అంటే కదిరేశన్ అన్నట్లుగా ధనుష్ వారి కొడుకేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒంటి మీద ఉన్న మచ్చలు తొలగించుకున్నట్లుగా నిర్ధారణ అయ్యింది. ఆ మచ్చలు ఎందుకు తొలగించుకోవాల్సి వచ్చింది అనేది కూడా ధనుష్ వెళ్లడి చేయడం లేదు. మొత్తానికి ధనుష్ నోరు తెరవక పోవడంతో వేలాది నోర్లు తెరుచుకుంటున్నాయి.