తెలుగు సినీ పరిశ్రమలో అద్భుత చిత్రంగా పేరు తెచ్చుకున్న ‘బాహుబలి 2’ చిత్ర హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్లను రాబడుతూ గత రికార్డలన్నీ కూడా తుడిచిపెడుతోంది. ఈ చిత్రంపై సినీ ప్రముఖులంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా మొదటి నుండి ‘బాహుబలి 2’ చిత్రాన్ని తెగ పొగిడేస్తున్నారు. నలుగురితో పోల్చితే విభిన్నంగా ఉండే వర్మ ‘బాహుబలి 2’ చిత్రాన్ని, యూనిట్‌ను మాత్రం ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. వర్మకు ఇంకా ‘బాహుబలి 2’ మత్తు వదల్లేదు. అందుకే ఇంకా ‘బాహుబలి 2’పై ట్వీట్లు చేస్తున్నాడు.
ఈ చిత్రంలో శివగామిది కీలక పాత్ర. మొదటగా ఈ పాత్ర కోసం అతిలోక సుందరి శ్రీదేవిని సంప్రదించారు. కాని కొన్ని కారణాల వల్ల శ్రీదేవి నో చెప్పింది. వర్మకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. తాజాగా ఆమె గురించి స్పందించాడు. ‘బాహుబలి 2’ చిత్రంలో శివగామి పాత్ర చేస్తే శ్రీదేవి కెరియర్‌లోనే అద్బుత చిత్రంగా నిలిచేది, అంతేకాకుండా ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ శ్రీదేవికే వచ్చేది, కానీ ఎందుకు నో చెప్పిందో అర్థం కాలేదు. ఈ గోల్డెన్ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంది అని ప్రశ్నిస్తూ వర్మ తాజాగా ట్వీట్ చేశాడు.