Site icon TeluguMirchi.com

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఈమెకు తెలుసట..

kattappaకట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న రెండేళ్లుగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది..ఈ ప్రశ్న ను అన్సార్ తెలిసింది కేవలం రచయత విజయేంద్ర ప్రసాద్ కి, దర్శకుడు రాజమౌళికి, చంపిన కట్టప్ప సత్యరాజ్ కి, చనిపోయిన బాహుబలి ప్రభాస్ కి మాత్రమే అని మనకు తెలుసు..కానీ మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి నాకు అన్సార్ తెలుసు అని తన ట్విట్టర్ లో చెప్పడం అందర్నీ షాక్ కు గురిచేస్తుంది..

చాల సీక్రెట్ గా దాచిన ఈ నిజం ఈమెకెలా తెలుసు..తన పుట్టినరోజు సందర్భాంగా అందరూ ఈమె గురించి మాట్లాడుకోవాలని ఇలా అంటుందా..? లేక నిజంగానే తెలుసా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మంచు ‘లక్ష్మీ బాంబు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రాత్రి దాసరి చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియో వేడుక జరిగింది. దాసరితో పాటు మోహన్ బాబు, చిత్ర బృందం, తదితరాలు పాల్గొన్నారు.

Exit mobile version