Site icon TeluguMirchi.com

‘గబ్బర్’ ఎందుకు లేటౌతున్నాడు ?

pavan‘అత్తారింటికిదారేది’ చిత్రం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం గ‌బ్బర్‌సింగ్‌2. ఎప్పుడెప్పుడా.. అనిపిస్తున్న ఈ చిత్రానికి ఇంకా ఫైనల్ కాని పనులు రెండు వున్నాయి. మొదటిది గబ్బర్ కి ఇంకా హీరోయిన్ దొరకలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రేస్ లో ఆకట్టుకున్న రకుల్ ప్రిత్ సింగ్ హీరోయిన్ అనే వార్తలు వినిపిస్తున్న ఇంకా ఆఫిసియల్ స్టేట్ మెంట్ రాలేదు. ఇక రెండోది.. ‘గ‌బ్బర్‌సింగ్‌2’ స్క్రిప్ట్‌. ఈ మూవీకు సంబంధించిన‌ స్క్రిప్ట్‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చూసి, డైరెక్టర్ సంప‌త్ నంది వ‌ద్ద నుండి ఇంకా క్వాలిటి స్క్రిప్ట్ కావాలంటూ అడిగాడుట. అందుకే సంప‌త్ ‘గ‌బ్బర్‌సింగ్‌2’ స్క్రిప్ట్‌కు ఫైన‌ల్‌గా తుదిమెరుగులు దిద్దుతున్నాడు అని టాక్. మొత్తంగా ‘గబ్బర్‌సింగ్‌2’ మూవీ షూటింగ్ జ‌న‌వ‌రి నెల‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. ‘అత్తారింటికిదారేది’ వంటి బ్లాక్‌బ‌స్టర్ స‌క్సెస్ త‌రువాత వ‌స్తున్న మూవీ ‘గ‌బ్బర్‌సింగ్‌2’ కావ‌డంతో ఈ చిత్రం పై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు.

Exit mobile version