Site icon TeluguMirchi.com

చ‌ర‌ణ్‌ని అలా చూపించేదెవ్వ‌రు…??

ramcharanయంగ్ హీరోలంతా మాస్‌, యాక్షన్ క‌థ‌ల‌వైపే మొగ్గు చూపుతున్నారు. క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాలు అందుకోవాలంటే ఆ బాటే స‌రైన‌ది. కాక‌పోతే పాత్రల్లో వైవిధ్యం చూపించ‌డం కుద‌ర‌దు. అందుకే క‌నీసం అప్పుడ‌ప్పుడైనా రూటు మార్చాల్సిందే. ర‌చ్చ‌, నాయ‌క్‌, ఎవ‌డు సినిమాల‌తో విజ‌యాలు అందుకొన్నా… ఈ మూడూ ఫార్ములా క‌థ‌లే. అందుకే వీటికి వీలూనంత త్వర‌గా బ్రేక్ ఇచ్చి… స‌రికొత్తగా క‌నిపించాల‌నుకొంటున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. అందుకోసం త‌న ప‌రిధిలోనే ప్రయోగాలు కూడా చేయాల‌ని నిర్ణయించుకొన్నాడు. అవ‌స‌రమైతే పౌరాణిక‌, చారిత్రక సినిమాలూ చేస్తాడ‌ట‌. శ్రీ‌కృష్ణదేవ‌రాయుల పాత్ర ఎవరైనా ఇస్తే చేస్తా.. అంటున్నాడు చ‌ర‌ణ్‌. మ‌రి చ‌ర‌ణ్ కోరిక ఏ ద‌ర్శకుడు తీరుస్తాడో…? లేదంటే రామ్‌చ‌ర‌ణ్‌ని మ‌గ‌దీరుడిగా చూపించిన రాజ‌మౌళే ఈ సాహ‌సానికి ఒడిగ‌ట్టాలేమో…?

Exit mobile version