రెజీనాతో రొమాన్స్ చేసేది ఎవ‌రు?

rejinaగౌర‌వంతో ఎంట్రీ ఇస్తున్నాడు అల్లు శిరీష్‌. ఇది కులం, వ‌ర్గం.. త‌దిత‌ర అంశాల‌పై సాగే సీరియ‌స్ స‌బ్జెక్ట్‌. ఈసారి మాత్రం యూత్‌ ఫుల్ క‌థ‌నే ఎంచుకోవాల‌ని చూస్తున్నాడు. అందుకే… రెండో సినిమా కోసం మారుతి జ‌ట్టు క‌ట్టాడు. మారుతి-శిరీష్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. దాని పేరు… కొత్త జంట‌. ఈ సినిమాలో శిరీష్‌ తో రొమాన్స్ చేయ‌డానికి రెజీనాను ఎంచుకొన్నారు. రొటీన్ ల‌వ్‌ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన రెజీనా… తెలుగు ప‌రిశ్రమ దృష్టిని ఆక‌ర్షించింది. ఎన్టీఆర్‌ తో ఓ సినిమాలో ఛాన్స్‌ వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారిపోయింది. ఇప్పుడు నారా రోహిత్ సినిమాలో న‌టిస్తోంది. ఈలోగా శిరీష్  సినిమా త‌లుపు త‌ట్టింది. త్వర‌లోనే శిరీష్‌, రెజీనాల రొమాన్స్ చూడొచ్చన్నమాట.