Site icon TeluguMirchi.com

నారా రోహిత్ ‘లవర్’ ఎవరు?

nara-rohit-loverకార్తికేయ దర్శకత్వం లో నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవర్’. సుడిగాడు ఫేం మోనాల్ గజ్జర్, ఆదా శర్మలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడి రైల్వే స్టేషన్ సెట్లో యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ.. తొలి షెడ్యూలు షూటింగు ఇటీవలే రాజమండ్రి పరిసరాల్లో జరిగిందనీ, ఇది వెరైటీ ప్రేమ కథా చిత్రమనీ, రోహిత్ ఓ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారని తెలియజేశాడు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా నారా రోహిత్, నిత్యా మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఒక్కడినే’ విడుదలకు సిద్దంగా వుంది.

Exit mobile version