Site icon TeluguMirchi.com

ఎవ‌డు ఎప్పుడొస్తాడు?

yevaduరామ్‌ చ‌ర‌ణ్ సినిమా ఎవ‌డు సంక్రాంతికి వాయిదా ప‌డింది. అయితే జ‌న‌వ‌రి 12న ఈ సినిమా రావ‌ట్లేద‌ట‌. దానికంటే ముందో, ఆ త‌ర‌వాతో వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. జ‌న‌వ‌రి 10న మ‌హేష్ బాబు 1 రావ‌డం ఖాయం. రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఎవడు రిలీజ్ చేయ‌డం రిస్క్ అని దిల్ రాజు భావిస్తున్నాడు. క‌నీసం మ‌హేష్ సినిమాకీ, చ‌ర‌ణ్ సినిమాకీ వారం రోజుల గ్యాప్ అయినా ఉండాల్సిందే. ఎందుకంటే థియేట‌ర్లు లేవు. ఓ సిటీలో ప‌ది థియేట‌ర్లుంటే క‌నీసం ఎనిమిది థియేట‌ర్లు మ‌హేష్ నిర్మాత‌లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్నారు. ‘ఎవ‌డు’కు థియేట‌ర్లు దొర‌క‌డం గ‌గ‌నం అయిపోయింది. అందుకే వీలైతే మ‌హేష్ సినిమా కంటే ముందొచ్చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్నారు. అంటే.. సంక్రాంతి సంద‌డి ముందే మొద‌లైపోతుంద‌న్న‌మాట‌.
Exit mobile version