Site icon TeluguMirchi.com

మ‌రి గీత‌ర‌చ‌యిత‌లు ఏమైపోవాలా..?!

whats about writersభార‌తీయ గాయ‌కుల హ‌క్కుల సంఘం (ఐఎస్ఆర్ఏ) .. గొప్ప ఘ‌న విజ‌యం సాధించింది. ఇక‌పై టీవీ ఛాన‌ళ్లలో, ఎఫ్‌.ఎమ్‌.రేడియోల్లో, విమానాశ్రయాల్లో ఏ పాట ప్రసారం చేసినా, సంబంధిత గాయ‌కుడికి రాయ‌ల్టీ చెల్లించాల్సివుంటుంది. సెప్టెంబ‌రుల నుంచి ఈ రాయ‌ల్టీ చ‌ట్టం అమ‌లుకానుంది. నిజంగా ఎస్‌.పీ బాల‌సుబ్రహ్మణ్యం చెప్పిన‌ట్టు గాయ‌కులకు ఇదో వ‌ర‌మే. అయితే గీత‌ర‌చ‌యిత‌లు, సంగీత ద‌ర్శకులు ఏమైపోవాలి? పాటంటే సంగీతం, సాహిత్యం, గానం – అలాంట‌ప్పుడు గాయ‌కుల‌కే రాయ‌ల్టీ ఇవ్వాలా? అందులో వాటా అడిగే హ‌క్కు గీత‌ర‌చ‌యిత‌ల‌కు, సంగీత ద‌ర్శకుల‌కూ లేదా? ఈ రాయ‌ల్టీ విష‌యం గాయ‌కుల్లో విశ్వాసాన్నీ, భ‌ద్రత‌నీ ఇవ్వొచ్చు గాక‌. మ‌రి మిగ‌తావాళ్లు ఏమైపోవాలి. అస‌లు ఇంత డ‌బ్బు పెట్టి ఓ పాట రూపొందించిన నిర్మాత ఏమైపోవాలి? ఈ విష‌యం ర‌చయిత‌లు, సంగీత ద‌ర్శ‌కుల‌కు కాస్త ఝుల‌క్ ఇచ్చేటట్టు క‌నిపిస్తోంది. మ‌రి వారి స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version