Site icon TeluguMirchi.com

మోహ‌న్‌బాబు ఏం చెబుతాడో..??

mohan-babuuuu(1)సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు మోహ‌న్‌బాబు పెట్టింది పేరు. ముక్కుసూటిగా, మ‌న‌సులో ఏముందో అది చెప్పేస్తారు. ఇప్పుడూ… కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈరోజు తిరుమ‌ల‌లో మోహ‌న్‌బాబు త‌న పుట్టిన రోజు వేడుక‌లు చేసుకొంటున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని దర్శించుకొన్నారు. ప‌వ‌న్ పార్టీపై మీ అభిప్రాయం ఏమిటి? అని విలేక‌రులు ఆడిగితే – దైవ‌స‌న్నిధిలో రాజ‌కీయాల గురించి మాట్లాడ‌డం ప‌ద్ధ‌తి కాదు. త్వ‌ర‌లో నేనే కొన్ని సంచ‌ల‌న విషయాలు చెబుతా అని స‌మాధానం దాట‌వేశారు. దాంతో మోహ‌న్‌బాబు ఏం చెబుతారో.. అనే ఆస‌క్తి నెల‌కొంది. ఈసారి ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. తేదేపా మ‌ద్ద‌తుతో బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తార‌ని స‌మాచార‌మ్‌. ఈవిష‌య‌మే ఆయ‌న మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి మ‌ద్ద‌తు తెలిపుతార‌ని.. విశ్లేషకులు చెబుతున్నారు.

Exit mobile version