మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుకుంటుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయం అందరికి తెల్సిందే. అందుకే ఖచ్చితంగా ఈ చిత్రం నుండి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సర్‌ప్రైజ్ వస్తుందని అంతా ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఏం సర్‌ప్రైజ్‌ను మెగా ఫ్యాన్స్‌కు ఇవ్వబోతున్నాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు ఇంకా ఎంతో మంది స్టార్స్ కనిపించబోతున్నారు. హిందీ నుండి అమితాబచ్చన్, తమిళం నుండి విజయ్ సేతుపతి, కన్నడ నుండి సందీప్ ఇంకా పలువురు స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. ఇక హీరోయిన్స్ నయనతార మరియు తమన్నాలు నటించారు. ఇదే చిత్రంలో నిహారిక కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇంతటి స్టార్ కాస్ట్ ఉన్న ఈ చిత్రంను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రామ్ చరణ్ నిర్మించాడు. బాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న సినిమాకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఏమైనా వీడియో విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి మెగా వర్గాలు ఎలా రెస్పాన్స్ అవుతాయో చూడాలి.