ప్రేమ కథలకు సరితూగే కథానాయకుడు ఎవరు? ఈ ప్రశ్న సిల్లీగా అనిపించొచ్చుగానీ.. కాస్త ఆలోచిస్తే సమాధానం దొరకడం కష్టమే. ఎందుకంటే మన హీరోలంతా ప్రేమకథలు చేస్తున్నారు. కానీ అందులో యాక్షన్ మోతాదే ఎక్కువ. మాస్, మసాలా జోడింపులు లేని స్వచ్ఛమైన ప్రేమకథ చేసే కథానాయకుడు కరవయ్యాడు. ఇప్పుడు నితిన్ ఆ ప్లేసు భర్తీ చేస్తున్నాడా? ఓ రొమాంటిక్ హీరోగా అవతారం ఎత్తుతున్నాడా? నితిన్ పయనం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ‘ ఇష్క్ ‘ సినిమాతో తనకు ఎలాంటి కథలు నప్పుతాయో తెలుసుకొన్నాడు నితిన్. ఆ తరవాత ‘ గుండెజారి గల్లంతయ్యిందే’ కోసం క్లీన్ లవ్ స్టోరీకే ఓటేశాడు. ఇప్పుడప్పుడే నితిన్ లవ్‌స్టోరీల నుంచి పక్కకు రాకపోవచ్చు. రొమాంటిక్ హీరో లేని లోటును కొంత వరకూ నితిన్ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటన, డాన్సులు…. ఈ విషయంలో నితిన్ లోటు చేయడు. ఇప్పుడిప్పుడే రొమాన్స్ కూడా చేయడం నేర్చుకొన్నాడు. లవర్‌బోయ్‌లూ, చాక్లెట్ బోయ్‌లూ… మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తున్న రోజుల్లో… నితిన్ రొమాంటిక్ హీరో అవతారం ఎత్తడం శుభసూచకం. లవ్ స్టోరీలు ఎంచుకొన్నంత కాలం నితిన్‌కి తిరుగులేదు.