ఈ వేడుకల్లో విజయ్ సందడి చేసిన సమయంలో ఆయన చేతి వేలికి గాయం కనిపించింది. ఆ గాయం ఏంటీ, ఎప్పుడు అయ్యిందా అంటూ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ షూటింగ్ సమయంలోనే గాయ పడ్డాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి చేతి వేలికి గాయం అయ్యింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక చిత్రాన్ని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో చేతికి గాయం అయ్యి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ గాయం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.