రౌడీ గాయంకు కారణం ఏంటో?

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం యూత్‌లో ఏ స్థాయి క్రేజ్‌ను దక్కించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ఈయన డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. విజయ్‌ దేవరకొండ నటన మరియు అతడి అప్పియరెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కాని సినిమా కథ మరియు కథనం విషయంలో ఫ్లాప్‌ అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ ఇంకా పెరిగేది. తాజాగా ఈయన సైమా అవార్డు వేడుకల్లో పాల్గొన్నాడు.

ఈ వేడుకల్లో విజయ్‌ సందడి చేసిన సమయంలో ఆయన చేతి వేలికి గాయం కనిపించింది. ఆ గాయం ఏంటీ, ఎప్పుడు అయ్యిందా అంటూ అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ షూటింగ్‌ సమయంలోనే గాయ పడ్డాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి చేతి వేలికి గాయం అయ్యింది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ఒక చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో చేతికి గాయం అయ్యి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌ దేవరకొండ గాయం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.