Site icon TeluguMirchi.com

ప్రభాస్ అంటే ఎంత లైకింగో…

prabhasయంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆషామాషీగా లేదు. అత‌ను ఫేస్ బుక్‌ లో చేరి రెండు రోజులే అయ్యింది. ఇప్పటికి 5 ల‌క్షల మంది లైకులు కొట్టారు. ఇంకా కొడుతూనే ఉన్నారు. రెండు రోజుల వ్యవ‌ధిలో ఈ స్థాయిలో లైక్స్ వ‌చ్చిన సెల‌బ్రెటీ ఒక్క ప్రభాసేనేమో..? ప్రభాస్‌ కి యూత్‌ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో అయితే మరీనూ. ఫేస్ బుక్ ద్వారా ఎప్పటి క‌ప్పుడు ప్రభాస్ త‌న సినిమా విష‌యాలు తెలియ‌జేస్తాడ‌ట‌. దాంతో.. ప్రభాస్ ఫేస్ బుక్ ఎకౌంట్ ఫుల్లు ర‌ద్దీలో ఉంది. మీరూ ప‌నిలో ప‌నిగా ఓ లైక్ కొట్టేయండి బాస్‌..!

Exit mobile version