సైరా ముందు వార్ తుస్సు అయ్యింది..

చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి , హృతిక్ రోషన్ నటించిన వార్ ఈ రెండు చిత్రాలు కూడా గాంధీ జయంతి సందర్భాంగా ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలయ్యాయి. నార్త్ లో హృతిక్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం తో సైరా వార్ ముందు కష్టమే అని అంత అనుకున్నారు. కానీ సైరా ముందు వార్ తుస్సు అయ్యింది.

తెలుగు మీడియా మాత్రమే కాదు బాలీవుడ్ మీడియా అక్కడి సినీ విశ్లేషకులంతా కూడా సైరా సూపర్ హిట్ అంటూ..చిరంజీవి నటన అమోగం..చరణ్ నిర్మాణ విలువలు ఓ స్థాయి..అంటూ మెగా ప్రశంసలు , రేటింగ్ లు ఇచ్చారు. ‘సైరా’కు గట్టిపోటీ అయిన ‘వార్’ అంత పాజిటివ్ రేటింగులను పొందకపోవడం గమనార్హం. ఈ సినిమా హిందీలో భారీఎత్తున విడుదల అయ్యింది. సౌత్ లోని నగరాల్లో కూడా ఈ సినిమాను భారీ సంఖ్యలోని థియేటర్లలో విడుదల చేశారు. కానీ సైరా టాక్ తో పోలిస్తే వార్ పెద్దగా లేదని తెలుస్తుంది.