Site icon TeluguMirchi.com

వార్ మాములుగా లేదు..

హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ వార్. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.

ఇప్పటికే టీజర్‌తో సెన్సేషన్‌ సృష్టించిన చిత్ర మేకర్స్ తాజాగా 2 నిమిషాల 25 సెకన్ల ట్రైలర్‌ విడుదల చేసి సినిమా ఫై అంచానాలు పెంచారు. ఈ చిత్రంలో హృతిక్‌ కబీర్‌గా, టైగర్‌ ఖలీద్‌గా కనిపించనున్నారు. రుశిష్యులైన వీరిద్దరు ప్రత్యర్థులగా ఎందుకు మారారు అన్నదే వార్‌ కథ. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమూవీని హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

Exit mobile version