ఛార్మి, శ్రియ మధ్య పోరు మొదలైంది

charmi-shreyaవేశ్య పాత్రలకు మంచి డిమాండ్. అటు గ్లామర్, ఇటు నటన కలబోసి కొట్టేయొచ్చు. కాస్త శ్రుతిమించినా ‘పాత్ర డిమాండ్ చేసింద’ని చెప్పుకోవచ్చు. అందుకే.. ఈ తరహా పాత్రలొస్తే ఏమాత్రం వదులుకోరు కథానాయికలు. దానితో పాటు అవార్డులూ, రివార్డులూ వాళ్లకే దక్కుతాయి. ఇప్పుడు ఛార్మి, శ్రియలు కూడా వేశ్యపాత్రలతో హంగామా సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఛార్మి ‘ప్రేమ ఒక మైకం’, శ్రియ ‘పవిత్ర’ సినిమాలు ఒకేసారి సెట్ పైకి వెళ్లాయి. విచిత్రంగా ఇంచుమించు రోజుల వ్యవధిలో ఆడియో వేడుకలు జరుపుకొన్నాయి. మరీ విచిత్రంగా.. ఒకే సమయంలో విడుదలకు సన్నద్దం అవుతున్నాయి.

shriya_saraఛార్మి, శ్రియ కెరీర్ ఇప్పుడు చాలా డల్ గా సాగుతోంది. ఇద్దరూ విజయాలు చూసిన వారే, స్టార్ డమ్ ని అనుభవించిన వారే. మధ్యలో ప్రత్యేక గీతాల్లోనూ మెరిశారు. మరోసారి తమ హవా చూపించడానికి ఇద్దరూ వేశ్య పాత్ర ఎంచుకోవడం యాదృచ్చికమే అయినా వారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే ఈ సినిమాలపై ప్రేక్షకులకు ఎన్నో కొన్ని అంచనాలున్నాయి. మామూలు కమర్షియల్ సినిమాలు చేస్తే ఛార్మి, శ్రియలను పట్టించుకోకపోదురు. కానీ ఈ రెండు సినిమాలు అలా కాదు, ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేవే. పైగా టీజర్లు వేడి పుట్టించడం మొదలెట్టేశాయి. ‘పవిత్ర’లో కొన్ని డైలాగుల గురించి పరిశ్రమలో చర్చించుకొంటున్నారు. దొంగ బాబాలపై, కుతంత్ర రాజకీయ నేతలపై వేసిన సెటైర్లు ఆకట్టుకొన్నాయి. సినిమావాళ్లని వదల్లేదట. మొత్తమ్మీద ‘పవిత్ర’ ఓ హాట్ టాపిక్. జనార్థన మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన ఓ మాటల మాంత్రికుడు. చురుక్కుమనే డైలాగ్ పేలుస్తూ, అంతలోనే అయింట్ మెంట్ పూసేస్తారు. ‘పవిత్ర’లో అలాంటి ఛమక్కులు చాలానే చూడొచ్చు.

charmiఇప్పుదు శ్రియకు ఛార్మి పోటికి వస్తోంది. ‘ప్రేమ ఒక మైకంతో’. ‘మల్లిక తలచుకొంటే ఎలాంటి మగాడినైనా మత్తెక్కిస్తుంది…’లాంటి డైలాగులతో థియేటర్లలో వేడి సెగలు పుట్టించబోతుంది ఛార్మి. ఓ చేతిలో మందు గ్లాసు, కళ్లలో కైపు నింపుకొన్ని ఛార్మింగ్ లేడీ ఫొటోలపై యువతరం దృష్టి పడుతోంది. ఈ సినిమా ఏదో ఓ మ్యాజిక్ ఖాయమని అటు చిత్రబృందంతో పాటు.. ఇటు పరిశ్రమ కూడా భారీగా ఆశలు పెంచుకొంది. ఛార్మి, శ్రియ కెరీర్ ఎలా సాగబోతోంది? భవిష్యత్ లో వారికి అవకాశాలు వస్తాయా? అనే ప్రశ్నలకు ఆ సినిమాలే సమాధానం చెప్పాలి. సినిమాలు ఏమాత్రం ఆడినా – మరో రెండేళ్ల పాటు కథానాయికలిద్దరూ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు. మరి అలాంటి ఫలితం వస్తుందా? వేశ్యగా ఛార్మి, శ్రియ ఎవరు మెప్పిస్తారు? వీరిద్దరిలో మీ ఛాయిస్ ఎవరు? మీరే తేల్చుకోండి.