అత్తారింటికి దారేదితో టాలీవుడ్‌ని షేక్ చేసేశాడు పవన్ కల్యాణ్. ఇప్పుడు అతని చూపు గబ్బర్ సింగ్ 2పై పడింది. అత్తారింటికి దారేది విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలోనే గబ్బర్ స్ర్కిప్టుపై బాగా హోం వర్క్ చేశాడు. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినప్పుడే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకొంటున్నాడు. అవన్నీ ఒకొక్కటీ కుదురుతూ వస్తున్నాయి. హీరోయిన్ తప్ప… మిగతావన్నీ రెడీ! ఆ హీరోయిన్ దొరికిస్తే ఈసినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లిపోతారు. డిసెంబరు నెలాఖరునుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు. కథానాయిక పేరు మరో వారం రోజుల్లో ప్రకటిస్తారని సమాచారమ్.