Site icon TeluguMirchi.com

మహానటి డైరెక్టర్ భారీ ఆఫర్..

మహానటి చిత్రం తో ఎంతో పేరు తెచ్చుకున్న నాగ అశ్విన్ త్వరలో ఓ భారీ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మహానటి తర్వాత చాల గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా ఇదే అని తెలుస్తుంది. ఈ భారీ చిత్రాన్ని నిర్మించేది కూడా మహానటి చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ వారే కావడం విశేషం. తాజాగా ఈ బ్యానర్ భారీ ఆఫర్ ప్రకటించింది.

తాము వచ్చేనెలలో మొదలుపెట్టనున్న భారీ చిత్రంలో పనిచేయుటకు విజువల్ ఆర్టిస్ట్స్,డిజైనర్స్, మరియు రైటర్స్ కావాలంటూ ప్రకటించారు. వారు అడిగిన సాంకేతిక నిపుణులను పరిశీలించినట్లైతే ఇది అడ్వెంచర్స్ తో కూడిన భారీ పీరియాడిక్ మూవీ అని అర్థం అవుతుంది. ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version