‘క్షణం’, ‘అమీ తుమీ’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి వినూత్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న అడవి శేష్.. తాజాగా మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మించగా.. ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేసాడు. పాన్ ఇండియా గా రిలీజ్ అయినా ఈ మూవీ ఫై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు సినిమా ఫై కామెంట్స్ చేయగా..తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘ఇప్పుడే మేజర్ సినిమాను చూశాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజమైన స్ఫూర్తిదాయకమైన కథ ఇది. మీకు బాగా నచ్చుతుంది. అడివి శేష్ అద్భుతంగా నటించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. కచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది’అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.